VSP: రంపచోడవరం ఆపరేషన్స్ స్పెషల్ డ్యూటీ (వోఎస్డీ), జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్ అడహళ్లి విశాఖపట్నం డీసీపీ-1 (లా అండ్ ఆర్డర్)గా బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జగదీశ్ అడహళ్లి యూపీఎస్సీ పరీక్షల్లో 440వ ర్యాంకు సాధించారు. అల్లూరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు.