TG: డిజిటల్ అరెస్టు పేరుతో HYDలోని ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో మీ సిమ్ వాడారంటూ బాధితుడు (78)కి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ పేరుతో వాట్సాప్ కాల్ చేశారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దీంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.