సత్యసాయి: ధర్మవరం గుట్టకిందపల్లి వార్డు ఇంచార్జ్ వెంకటప్పతో పాటు ఆ వార్డుకు చెందిన యువత జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ మార్పులో యువత పాత్ర కీలకమన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. యువత అభివృద్ధికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.