ఇటీవలే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరో ప్రాజెక్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ గోపు తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించనుండగా.. 2026 జనవరి మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. అంతేకాదు అదే నెల చివరిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందట.