TG: వనపర్తి కాంగ్రెస్ MLA మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వనపర్తిలో చాలా చోట్ల BRS గెలవడానికి తమ వాళ్లే కారణమని, కొంతమంది పెద్దలు కావాలనే అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఓడేలా.. BRS గెలిచేలా చేశారని మండిపడ్డారు. అధికారులతో సహా పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.