రాష్ట్రంలో రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణపై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి లేఖ రాశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనేదానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సీఈఓ ఈ లేఖ రాశారు.