AP: కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. విజయవాడ భవానీపురంలోని శ్రీనివాస వైన్స్ షాపు లైసెన్స్‌ను రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురానికి నకిలీ మద్యం తీసుకొచ్చి బార్ ఓనర్ విక్రయిస్తున్నాడన్న ఆరోపణలతో రద్దు చేశారు. కల్తీ మద్యం విక్రయంపై ఇటీవల బార్ యజమానికి నోటీసులు ఇచ్చారు. బార్ ఓనర్ వివరణపై సంతృప్తి చెందకపోవడంతో రద్దు చేసినట్లు తెలుస్తోంది.