సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని, పటేల్ అభిప్రాయాలను నెహ్రూ గౌరవించలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగం పాక్ ఆక్రమించుకుందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం చూసిందని ప్రధాని పేర్కొన్నారు.