TPT: మండలంలోని మాధవరం-1లో చేనేత కార్మికుల మగ్గం గుంతలను శుక్రవారం జనసేన చేనేత కార్యదర్శి రామయ్య పరిశీలించారు. బాధితుల వినతి మేరకు చేనేత కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మగ్గం గుంతల్లోకి నీరుచేరి సామాగ్రి దెబ్బతిని, కూలి పనులు కూడా నిలిచిపోయాయన్నారు. చేనేతల సమస్యలను DY సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.