KKD: పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా ఇళ్ల స్థలం, పెన్షన్లు, రోడ్ల కోసం అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. సంబంధిత శాఖ అధికారులకు ఈ అర్జీలు పంపామని, త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని వర్మ హామీ ఇచ్చారు.