KMM: కల్లూరు మండలంలోని చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఇస్రాత్ సమక్షంలో గర్భిణీలకు క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్షయ నిర్మూలన సూపర్వైజర్ వై.సురేష్ మాట్లాడుతూ.. క్షయ ఒక అంటువ్యాధి అని, దీని లక్షణాలు, నివారణ పద్ధతులపై సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.