TG: ఆస్తి నష్టం, పంట నష్టం అంచనాలో ప్రజాప్రతినిధులను వెంట తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లతో నివేదికలు సిద్ధం చేయించాలన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేంద్రం వదిలేస్తే కుదరదని తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి ప్రతి రూపాయి రాబట్టేలా కలెక్టర్లు నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.