ASR: మత్తు రహిత సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.చిట్టబ్బాయి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కళాశాలలో ఈగిల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఇంఛార్జ్ శివశంకర్‌తో కలిసి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత, విద్యార్థులు ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలన్నారు.