BDK: గత రెండు రోజులుగా విద్యుత్ లేక మోటార్లు పనిచేయకపోవడంతో తాగునీరు, వాడుక నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ములకలపల్లి ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటి సమస్యలపై శుక్రవారం నిరసన తెలిపారు. రాత్రి వేళల్లో దోమల బాధ అధికమైందని, సౌకర్యాల కొరతను అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.