ప్రకాశం: కంభం పట్టణంలో శానిటేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు విస్తృతంగా నిర్వహించారు. ప్రధాన వీధులు, మార్కెట్ ప్రాంతాలు, కాలనీల్లో చెత్తను తొలగించి, రోడ్లను శుభ్రం చేయించారు. దుర్వాసన రాకుండా పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.