కురబలకోటలో శుక్రవారం ఉదయం సింగిల్ విండో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఎరమద్ది జయరాం రెడ్డి ఛైర్మన్గా, చామంతి రెడ్డప్ప, వలిపి నాగరాజు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, రైతులు నూతన కమిటీ సభ్యులను పూల బొకేలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.