KMM: కల్లుగీత కార్మిక సంఘం కూసుమంచి మండల అధ్యక్ష, కార్యదర్శులుగా బొలికొండ పాపయ్య, మంద నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కూసుమంచిలో జరిగిన మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.