TG: BRS ప్రభుత్వం డిస్కంలను అప్పుల్లోకి నెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెంచాలని కోరారు. సింగరేణిలో రూ.42 వేల కోట్ల పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. డిస్కంలను ప్రైవేటీకరించే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. మోదీ పాలనలో ప్రైవేటీకరణ పదమేలేదని పేర్కొన్నారు.