ఎన్టీఆర్: వీరులపాడు మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా అభిమన్యు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తామన్నారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.