AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. లోకేష్‌తోపాటు కాశీబుగ్గకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత వెళ్లారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించగా 13 మంది గాయపడ్డారు.