CTR: చౌడేపల్లి మండల కేంద్రములో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా 2కె రన్ నిర్వహించారు. ఈ మేరకు ప్రారంభంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశ ఐక్యతకు చేసిన సేవలను వక్తలు వివరించారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు అందజేశారు.