TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్క్ విషాదం నెలకొంది. ఎర్ర మెడ గల మగ వాలబీ గురువారం ఉదయం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ మేరకు ఆహారం తినకపోవడంతో పరిస్థితి విషమించి మృతిచెందింది. వైద్య బృందం అత్యవసర చికిత్స, CPR చేసినా ఫలితం లేకపోయింది. పోస్ట్ మార్టంలో ఫలితాల్లో టాక్సోప్లాస్మోసిస్ కారణమని తేలింది.