AP: రాష్ట్రంలో కొన్ని చోట్ల రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. అలాగే కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొంది.