VZM: పట్టణంలోని స్థానిక 49వ డివిజన్లోని కంటోన్మెంట్లో NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శనివారం పరిశీలించారు. మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు వారణాసి పద్మావతి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. అవ్వా బాగున్నావా.. అంటూ పలకరించారు.