మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు దక్షిణాఫ్రికాతో టీమిండియా టైటిల్ కోసం తలపడనుంది. నవీ ముంబై వేదికగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటివరకు టికెట్లు అందుబాటులో లేకపోవడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. బుక్‌మై షోలో ఇంకా టికెట్ల విక్రయం మొదలుకాలేదు. దీంతో టికెట్ల కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు.