ప్రకాశం: పేదలకు నిత్యవసర సరుకులైన రేషన్ పంపిణీ చేసే స్మార్ట్ రైస్ కార్డులను ప్రైవేట్ వ్యక్తులచే పంపిణీ చేయడం సరియైన పద్ధతి కాదని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శనివారం ఆర్డీవో కేశవ వర్ధన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు సచివాలయ ఉద్యోగులతోకాని, రేషన్ డీలర్లతోకాని పంపిణీ చేయాలన్నారు.