KRNL: పెన్షన్ పంపిణీ విధులు నిర్వహించుకుని డోన్ వైపు వస్తుండగా చింతల పేట సమీపంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నారాయణ, ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించుకొని వస్తుండగా మార్గం మధ్యలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు పేర్కోన్నారు. ఈ ప్రమాదంలో ఎంపీడీవో,ఏఈ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడారని వారు తెలిపారు.