MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగి సాధిక్ పై శనివారం ఓ కోతి 30 నిమిషాలు సేద తీరింది. అయితే సాధారణంగా మనుషుల దగ్గరికి వెళ్తే దాడులు చేసే కోతి, ఇక్కడ కార్యాలయంలోకి అకస్మాత్తుగా వచ్చి సాధిక్ భుజాల పై ఎక్కి నిద్రపోయింది. ఈ దృశ్యాన్ని పలువురు వ్యక్తులు వీడియో తీయగా, నెట్టింట వైరల్గా మారింది.