అన్నమయ్య: నూతన కమిటీలతో బంజారాల జాతిని జాగృతం చేస్తున్నామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బి. నాగు నాయక్ అన్నారు. ఇవాళ బంజారా సేవా సంఘం సభ్యుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బి. చక్రి నాయక్. ప్రధాన కార్యదర్శి జె. రాంబాబు నాయక్ హాజరు అయ్యారు. వారు మాట్లాడుతూ.. సంఘటితంగా ఉంటేనే బంజారాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలిపారు.