KMM: వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. మధిరలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.