SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.