అన్నమయ్య: మదనపల్లె మండలం చిలకవారిపల్లికి చెందిన చిదనిగేపల్లి రమణయ్య (56) కుటుంబ సమస్యల కారణంగా శనివారం మద్యం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.