NRPT: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంపై హార్టికల్చర్, వ్యవసాయ పశు సంవర్ధక అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పారామీటర్తో కూడిన డాక్యుమెంటేషన్ కోసం అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.