AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దుకు మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి వామపక్ష పార్టీలు అండగా నిలుస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ. శ్రీనివాసరావు అన్నారు. శనివారం మత్స్యకారులు చేపట్టిన రిలే దీక్ష శిబిరానికి సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఈశ్వరయ్యతో వచ్చి సంఘీభావం ప్రకటించారు. 48 రోజులుగా పోరాటం చేస్తున్నా హోంమంత్రి స్పందించకపోవడం శోచనీయం అన్నారు.