TPT: యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా శనివారం తిరుపతి స్విమ్స్‌లో యాంటీ ర్యాగింగ్ కార్యక్రమంపై మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ర్యాగింగ్‌ను అరికట్టే చట్టపరమైన చర్యల గురించి సమగ్రంగా వివరించారు. ర్యాగింగ్ చేయడం వల్ల కలిగే నష్టం, చట్టాలు, శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం తీవ్రమైన నేరమన్నారు.