TPT: ఆస్ట్రేలియాపై ఘనవిజయంతో ఫైనల్ చేరిన భారత మహిళా జట్టు ఫైనల్లో కూడా విజయం సాధిస్తుందని ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగాంగా అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి జట్టు విజయం సాధించాలని మొక్కుకున్నారు. కాగా, సెమీఫైనల్లో కడపకు చెందిన శ్రీచరణి అద్భుత బౌలింగ్ చేయడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.