GNTR: తాడికొండ మండలం లచ్చన్న గుడిపూడిలోని ఎంఎల్పీపీ పాఠశాలలో గ్యాస్ పైపు లీకేజీతో మంటలు చెలరేగిన ఘటనపై డీఈవో సీవీ రేణుక శనివారం విచారణ జరిపారు. మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. వంట సమయంలో భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.