NRPT: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీసులు, మక్తల్ సర్కిల్ పోలీసులు, హోంగార్డు అధికారులకు వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఆర్ఎ నరసింహ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ ద్వారా పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. అలాగే, విధులపై అవగాహన పెరిగి, క్రమశిక్షణతో పనిచేయడానికి ఈ పరేడ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.