RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఉన్న నిషేధిత భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమాచార హక్కు చట్టం ద్వారా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కన్హశాంతి వనంలో నిషేధిత భూములు ఉన్నాయనే అభియోగాలు ఉన్నాయని తన దరఖాస్తులో పేర్కొన్నట్లు తెలిపారు.