HYD: రెండో దశ మెట్రో విధివిధానాలు తదితరాలకు సంబంధించి ఇంకా రివైజ్డ్ అగ్రిమెంట్ కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెండోదశ మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి స్పష్టత లేదని, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో పాత, కొత్త DPRను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.