GNTR: పొన్నూరులోని కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శనివారం తుఫాన్ బాధితులకు నగదు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న 565 కుటుంబాలకు మొత్తం రూ.11,30,000 అందజేశారు. తుఫాన్ వచ్చిన మరుసటి రోజే బాధితులకు రూ.1,600 విలువ గల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.