AP: కాశీబుగ్గ ఘటనపై TDP స్పందించింది. ‘సహాయక చర్యలకంటే, శవ రాజకీయాలు చేసే రాబందుల పార్టీ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం. ఈ ఆలయం ఒడిశా రాజ కుటుంబం నిర్వహణలో ఉంది. ఈ ఏడాది మే నెలలోనే ప్రారంభమైంది. కానీ ఏటా వేల మంది వస్తున్నారని ఫేక్ ప్రచారం చేస్తోంది. ఆలయ ధర్మకర్తలే ఇంత మంది ఎప్పుడూ రాలేదని అంటుంటే.. సమాచారం ఉందంటూ అనడం శవ రాజకీయం తప్ప మరేమీ కాదు’ అని పేర్కొంది.