NZB: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పురోగతి సాధించాలని కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, ఇతర అధికారులతో శనివారం భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయా సమస్యలపై బాధితుల నుంచి వినతిపత్రం స్వీకరించారు.