GDWL: మల్దకల్ మండలం, సద్దాలోనిపల్లి గ్రామంలోని కృష్ణ స్వామిని బీజేపీ జిల్లా యువ నాయకురాలు డి.కె. స్నిగ్ధ రెడ్డి శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం, ఆమె మంగంపేట గ్రామంలో జరిగిన వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.