NDL: దోర్నిపాడు మండలంలో “హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్” పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజా కుమారి తెలిపారు. నేడు కలెక్టరేట్ P.G.R.S హాల్లో సంస్థకు డబ్బు చెల్లించిన వారితో జిల్లా కలెక్టర్, ఎస్పీ సునీల్ షెరాన్, సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.