ATP: భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీలో ఏక్తా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ పాల్గొని, ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసింది పటేల్ అని, ఆయన కృషి భవిష్యత్ తరాలకు ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు.