HYD: రాజ్‌భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.