ATP: రాజనీతిజ్ఞుడు, భారత తొలి హోంమంత్రి, భారతదేశాన్ని ఉక్కు సంకల్పంతో ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్150వ జయంతి సందర్భంగా అనంతపురంలో ఏక్తా పాదయాత్ర కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.