ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం తగ్గి, ప్రజలు త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.