భారత హాకీ దిగ్గజం మాన్యుయేల్ ఫ్రెడెరిక్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా కేరళకు చెందిన ఫ్రెడెరిక్.. ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి క్రీడాకారుడు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో హాలాండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలవడంలో ఆయన గోల్‌కీపర్‌గా కీలక పాత్ర పోషించారు.